రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
PDPL: బసంతనగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన దంపతులు మృతి చెందారు. లయన్స్ క్లబ్, క్రెడాయి సభ్యుడైన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు హైదరాబాద్‌లో చదువుకుంటున్న కూతురు రిషిత వద్దకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా కలచివేసింది.