ఆటోను ఢీకొన్న డీసీఎం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఆటోను ఢీకొన్న డీసీఎం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఇవాళ రాత్రి ఆటోను డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.