VIDEO: 'మానసిక వేధింపులు అరికట్టాలి'
ATP: విద్యార్థులపై మానసిక వేధింపులను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేస్తూ గుంతకల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. పట్టణంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థులపై మానసిక వేధింపులకు గురి చేస్తుందన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.