పాలకొండలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
PPM: పాలకొండ మండలం బుక్కూరు గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ జామి విఠల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మంగళవారం మృతి చెందారు. ఇంట్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తలపై ఉన్న గాయాలు మరణంపై అనుమానాలు రేకెత్తించాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.