మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా
W.G: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనాల వెంకటరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధనాల రాజు, కే బాబు, ఏసమ్మ పాల్గొన్నారు.