రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

TPT: పాకాల మండలం ముద్దలపల్లి సమీపంలో సోమవారం రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి (30) మృతి చెందాడు. ప్రయాణంలో ఎలా పడిపోయాడనే అంశంపై స్పష్టతరాలేదు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.