క్యాన్సర్ స్క్రీనింగ్ పై శిక్షణ

క్యాన్సర్ స్క్రీనింగ్ పై శిక్షణ

మన్యం: సత్వర గుర్తింపుతో క్యాన్సర్ బారి నుండి తప్పించవచ్చని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు. NCD 4.0లో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి గురువారం ఎన్జీవో హోంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. గైనకాలజిస్ట్, డెంటల్ వైద్యులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పై పవర్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ అందించారు.