'పెరిగిన భవన నిర్మాణ సామాగ్రి ధరలు తగ్గించాలి'

'పెరిగిన భవన నిర్మాణ సామాగ్రి ధరలు తగ్గించాలి'

అనకాపల్లి: జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 7న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.రాము తెలిపారు. అచ్యుతాపురంలో సోమవారం భవన నిర్మాణ కార్మికులతో సమావేశయ్యారు. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో కార్మికులకు పనులు లేకుండా పోయారన్నారు. తక్షణమే పెంచిన నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించాలన్నారు.