పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి: కమిషనర్
NLG: మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉండి, స్థానికంగా ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ శరత్ చంద్ర సూచించారు. పాత R&B కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసులో ఈ నెల 5 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు 7 నుంచి 9వ తేదీ లోపు ఎన్నికల ఆర్డర్ కాపీని జతచేసి దరఖాస్తు సమర్పించాలని ఆయన కోరారు.