సోమశిల జలాశయానికి భారీగా చేరుతున్న వరద

సోమశిల జలాశయానికి భారీగా చేరుతున్న వరద

NLR: సోమశిల జలాశయానికి వరద కొనసాగుతుంది. సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి 23,124 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. డ్యాం పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా, జలాశయంలో 69.849 TMCల నీటిమట్టం నమోదైంది. పెన్నా డెల్టాకు 12,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.