విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ADB: జైనద్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (NCFE) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఎఫ్ఎల్ సిబ్బంది వినోద్, అజయ్ మాట్లాడుతూ.. డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక ప్రణాళిక, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 'డిజిటల్ అరెస్ట్' వంటి మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.