కృష్ణం పాలెంలో భారీ వర్షం
E.G: దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామంలో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులుతో భారీ వర్షం కురుస్తోంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అరటి, వరి పంటలు భారీగా నష్టపోతాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలంలో ధాన్యంకోత కోసి రాశులపై ఉంచారు. వర్షాలతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని బాధను వ్యక్తం చేస్తున్నారు.