కృష్ణా జిల్లాలో 310 మొబైల్స్ రికవరీ: ఎస్పీ

కృష్ణా జిల్లాలో చోరీకి గురైన 310 మొబైల్ ఫోన్లను బుధవారం ఎస్పీ గంగాధర్ రావు బాధితులకు అందించారు. ఎంఎంటీఎస్ నూతన టెక్నాలజీ వినియోగించి మొబైల్ ట్రాక్ ద్వారా రికవరీ చేసి బాధ్యులకు అప్పగించమన్నారు. గుడివాడ పీఎస్ 175, పెనమలూరు సీసీఎస్ 83, బందరు సీసీఎస్ 52 మొబైల్‌లను రికవరీ చేయగా జిల్లా వ్యాప్తంగా రూ.36 లక్షల విలువ చేసే 310 ఫోన్లను రికవరీ చేశామన్నారు.