స్త్రీ శక్తి పథకాన్ని పర్యవేక్షించిన డిపో మేనేజర్

ప్రకాశం: కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం సోమవారం కందుకూరు, సీఎస్.పురం రూట్ బస్సులు ఎక్కి స్త్రీ శక్తి గురించి ప్రయాణికులతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు తప్పనిసరిగా బస్సులో ప్రయాణం చేసే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఏదో ఒకటి తమ వెంట తెచ్చుకోవాలని, కండక్టర్‌కు సహకరించాలని కోరారు.