వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

NZB: జిల్లా డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఆరేళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు వివరాలు ఇలా. నాలుగు రోజుల క్రితం ఓ వృద్ధుడు బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిసింది. శుక్రవారం బాలిక కుటుంబసభ్యులకు విషయం తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.