'దివ్యాంగుల పెన్షన్ల రద్దును విరమించుకోవాలి'

అన్నమయ్య: దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను రద్దు చేయడం తక్షణం విరమించుకోవాలని ఏపీ వికలాంగులు పెన్షన్దారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. చిట్వేలులో ఆయన మాట్లాడుతూ.. అనర్హుల పేరుతో నిజమైన దివ్యాంగులకే అధికారులు నోటీసులు ఇచ్చారని, నోటీసులు అందుకున్న వారు ఒక్కరు కూడా అనర్హులు కాదని ఆయన అన్నారు.