మేఘాలయలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కొంతమంది దుండుగులు ఆ పట్టణంలోని దుకాణాల్లోకి చొరబడి దోచుకుంటున్నారు. అనంతరం వాటిని ధ్వంసం చేసి నిప్పు పెడుతున్నారు. దీంతో తమ కాలనీలను రక్షించుకునేందు ఆ ప్రాంత వాసులంతా స్వచ్ఛందంగా రాత్రంతా గస్తీ కాస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.