అనాథ ఆడపిల్లలకు ఆర్థిక సాయం

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన తడకమళ్ల వెంకన్న అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఆయన ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా దిక్కుతోచని పరిస్థితిలో ఉండడంతో వారికి శుక్రవారం నల్లగొండ జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మాతంగి వీరబాబు రూ.6,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.