గ్రామాల్లోని అభివృద్ధి ఘనత కేసీఆర్‌దే: జగదీశ్ రెడ్డి
SRPT: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఘనత తొలి సీఎం కేసీఆర్‌దేనని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ పాలనలో అన్నీ అమ్మకాలు, అరాచకాలే ఉన్నాయన్నారు.