పంచాయితీ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ మృతి
RR: పంచాయితీ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచర్ల గూడెం నుంచి 8వ వార్డు సభ్యురాలిగా పల్లె లత పోటీ చేస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా చాతిలో నొప్పి వచ్చి కుప్ప కూలింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.