'విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం'
SKLM: ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కాలేజీలో రూ. 2.49 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు వసతులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.