రహదారి పనులకు ఎమ్మెల్యే శ్రీధర్ భూమి పూజ

అన్నమయ్య: సుమారు 28 కోట్ల రూపాయలతో చిట్వేలి నుంచి రైల్వే కోడూరు వరకు రహదారి విస్తరణ పనులకు మంగళవారం శాసనసభ్యులు భూమి పూజ చేశారు. కూటమి పాలనలో రాబోవు రోజుల్లో ప్రతి మారుమూల గ్రామానికి సిమెంటు తారు రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. సాయి వికాస్ రెడ్డి, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.