బతుకమ్మ కుంట చెరువు అభివృద్ధి పనులు పరిశీలన

HYD: బతుకమ్మ ఉత్సవాల సమయం కంటే ముందే బతుకమ్మ కుంట సర్వాంగ సుందరంగా సిద్ధం కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈరోజు బతుకమ్మ కుంట చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చెరువు చుట్టూ పాత్ వే, నీడనిచ్చే చెట్ల పెంపకం, ప్రజలు సేదతీరేలా కూర్చునేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.