ఎల్‌వోసీ కాపీలను అందించిన ఎమ్మెల్యే
GDWL: ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇవాళ నియోజకవర్గంలోని ఇద్దరు లబ్ధిదారులకు రూ. 9 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్‌వోసీ కాపీలను అందజేశారు. అయిజ మండలం కేశవరంకు చెందిన రామ్రాన్‌కు రూ. 5 లక్షలు, మానవపాడు మండలం గోకులపాడుకు చెందిన బోయ నవ్యకు రూ. 4 లక్షల విలువైన LOCలను అందజేసి, ఆపరేషన్ల నిమిత్తం వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.