బాపట్లలో అనధికార నిర్మాణాలపై ఛార్జ్‌షీట్

బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు శనివారం మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 29 ఛార్జ్‌షీట్లు దాఖలు చేశామని చెప్పారు. బాపట్ల NGO భవనంపై రూ.52 లక్షల మేర ఛార్జ్‌షీట్ నమోదు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో అనధికార నిర్మాణాలను ఉపేక్షించేది లేదన్నారు.