రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
HYD: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ పంజాగుట్టలో జరిగింది. వెంకట నరసింహారెడ్డి అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కారు నడుపుతున్న ఆదిత్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా మద్యం తాగి కారు నడిపినట్లు వెల్లడించారు.