కాశిబుగ్గలో శునకాలు పట్టివేత

కాశిబుగ్గలో శునకాలు పట్టివేత

WGL: 20వ డివిజన్ పరిధిలో కుక్కలు, కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో స్థానికులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక కార్పొరేటర్ నరేంద్రకుమార్ ఆదేశాల మేరకు డివిజన్‌లోని పలు వీధులలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సానిటరీ ఇన్‌స్పెక్టర్ ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో జవాన్ బుట్టి బాబు, సిబ్బందిచే కుక్కలు, కోతులను పట్టుకొని తీసుకెళ్లారు.