ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: ఎంపీడీవో
VKB: పంచాయతీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలని పరిగి ఎంపీడీవో హరిప్రియ రెడ్డి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆమె ఎన్నికల సామాగ్రిని అందజేశారు. పరిగి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకుగాను మొత్తం 11 ఎన్నికల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో హరిప్రియ రెడ్డి తెలిపారు.