ఖమ్మం జిల్లాకు భారీ వర్ష సూచన.!
ఖమ్మం జిల్లాలో రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 24, 25, 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. వర్షం కురిసే సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అన్నారు. జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.