రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై
కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఎస్సై చంటిబాబు రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, బాధ్యతాయుత పౌరులుగా మారి చట్టాలను గౌరవించాలని సూచించారు. సమాజంలో ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.