నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లి, మద్దిమల్ల తండా గ్రామాల్లో ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలోని పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. పలు ఇళ్ల సమీపంలో సారా తయారీ కేంద్రాలను గుర్తించారు. నిల్వ చేసిన 180 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. సారా తయారీకి వినియోగించే క్వింటాలు ఇప్పపూవు, పాత్రలు, 18 లీటర్ల సారాను స్వాధీనపర్చుకున్నారు.