10% పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఒక్కరోజులోనే క్రూడ్ ఆయిల్ ధరలు 10% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 10% పెరిగి, ఒక బ్యారెల్ 85 డాలర్ల నుంచి 90 డాలర్ల స్థాయికి చేరుకుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది.