'ఈనెల 5 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు'

'ఈనెల 5 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు'

కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మండపేట పురపాలక సంఘ పరిధిలో ఈ నెల 5 నుంచి 15 వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రంగారావు ఆదివారం పేర్కొన్నారు. ప్రత్యేక ఆధార్ క్యాంపులో 0-6 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు బాల ఆధార్, 5-15‌ సంవత్సరాల వయసు దాటిన పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ సర్వీసులను వినియోగించుకొవాలని కోరారు.