లారీ బైక్ ఢీ.. వ్యక్తి మృతి

KMR: జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం లారీని మోటర్ సైకిల్ ఢీకొంది. ఈ బైక్‌పై వెళ్తున్న శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. అతను కల్వరాల్ గ్రామం అని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.