విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో స్థానికులు ఆవేదన

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో స్థానికులు ఆవేదన

కోనసీమ: అయినవిల్లి(మం) కే.జగన్నాధపురం గుత్తులవారిపాలెం వెళ్లే దారిలో విద్యుత్ వైర్లు మోకాలు ఎత్తు లోంచి వెళ్లడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మొంథా తుఫాన్ సమయంలో విద్యుత్ స్తంభం వంగి పోవడంతో దానిని అలానే ఉంచి విద్యుత్ వైర్లు తాత్కాలికంగా కింది నుంచి అమర్చారు. తర్వాత దానిని మరిచారని స్థానికుడు అంటున్నారు.