VIDEO: డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్లనే రోడ్డు ప్రమాదాలు : ఎస్సై
SRD: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఎస్సై మహేష్ అన్నారు. గురువారం సిర్గాపూర్ హైస్కూల్లో 9వ తరగతి విద్యార్థులకు రోడ్ సేఫ్టి, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఆయన అవగాహన కల్పించారు. జాగ్రత్తలు పాటించకనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు.