ప్రతి వార్డులో కౌన్సిలర్ పర్యటించాలి: అనన్య

ప్రతి వార్డులో కౌన్సిలర్ పర్యటించాలి: అనన్య

VKB: పట్టణాభివృద్ధియే లక్ష్యంగా కౌన్సిలర్లు ప్రతి వార్డులో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య శనివారం ఆదేశించారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో మాట్లాడుతూ.. అజెండాలోని 14 కీలక అంశాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేయాలని కోరారు.