చెరువును తలపిస్తున్న.. అంబేద్కర్ భవన్ ప్రధాన రోడ్డు
HNK: హన్మకొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి తిరుమల బార్ నుంచి అంబేడ్కర్ భవన్ వరకు ప్రధాన రోడ్డు జలమయమైంది. డ్రైనేజీ వ్యవస్థ లోపంతో వర్షపు నీరు గంటల తరబడి నిలిచి, వాహనాలు నత్తనడకన సాగాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య పై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.