VIDEO: గిరిజనులతో షర్మిల థింసా నృత్యం

VIDEO: గిరిజనులతో షర్మిల థింసా నృత్యం

AP: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పర్యటనలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందడి చేశారు. స్థానిక గిరిజన మహిళలతో కలిసి ఆమె ఉత్సాహంగా 'థింసా' నృత్యం చేశారు. వారి సాంప్రదాయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ గిరిజనులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్న షర్మిల, వారితో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.