పాడిరైతులకు గుడ్ న్యూస్
VZM: పశుపోషకులకు నాణ్యమైన జనరిక్ మందులు అందించేందుకు త్వరలో పశువుల మందుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ పథకం అమలుపై కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. వాటిని మహిళా సభ్యులు ఉన్న సహకార సంఘాల ద్వారా వెటర్నరీ ఆసుపత్రుల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామన్నారు.