ఓబులాపురంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం: గిద్దలూరు మండలం ఓబులాపురంలో ఉరి వేసుకుని దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. HYDలో పెయింటర్‌గా కూలి పనులు చేసుకుంటూ ఇటీవల గ్రామానికి వచ్చి కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. పోలీసులు కేేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.