రోడ్డు ప్రమాదంలో గేదె మృతి..!
ELR: ముదినేపల్లి శివారు పెట్రోల్ బంక్ వద్ద నిన్న రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొని గేదె అక్కడికక్కడే మృతిచెందింది. బంటుమిల్లి నుంచి గుడివాడ వెళ్లుతున్న ఆర్టీసీ అద్దె బస్సు ముదినేపల్లి శివారులో పెట్రోలు బంక్ వద్ద పశువును ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో వంకా నాగమణికి చెందిన గేదె మృతి చెందిందన్నారు. గేదె విలువ రూ.60 వేల నుంచి రూ.90,000 మేర ఉంటుందన్నారు.