శ్రీశైలం భక్తులకు ఈవో కీలక సూచనలు

శ్రీశైలం భక్తులకు ఈవో కీలక సూచనలు

NDL: శ్రీశైలం క్షేత్రంలో నకిలీ వెబ్ సైట్‌ల దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని ఈవో ఎం. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి అమ్మవారి ఆర్జిత సేవలో పాల్గొనడానికి కావాల్సిన టికెట్లను భక్తులు కేవలం ఆన్ లైన్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం దేవస్థానం వెబ్ సైట్‌లో  స్పర్శ దర్శనం మినహా 17 రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.