అధ్వానంగా బైపాస్ రహదారి

కడప: నగరంలోని ఇర్కాన్ కూడలి నుంచి రాజంపేటకు వెళ్లే బైపాస్ రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో వాహనాలు రాకపోకలు అధికంగా ఉంటాయి. గతంలో ఈ మార్గంలో పలుచోట్ల గుంతలు ఏర్పడడంతో ప్యాచింగ్ పనులు చేపట్టారు. వాటిపై గుంతలు మళ్లీ పడడంతో వాహనదారుల ప్రమాదాలకు గురవుతున్నారు.