కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: పొంగులేటి
KMM: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో వివిధ పార్టీలకు చెందిన పలు కుటుంబాలు మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు.