సీతారాంపురంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం
WG: నరసాపురం మండలం సీతారాంపురంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు కలవకొలను తాతాజీ ప్రారంభించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తీర ప్రాంతంలో మొత్తం 11 కేంద్రాలు ఏర్పాటు చేశామని, సార్వా పంట పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించుకోవచ్చన్నారు.