'రోజుకి 900 సిలండర్ల సరఫరా'
VZM: జిల్లాలోని కొన్ని మండలాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని, బుకింగ్ చేసిన 45 రోజులైనా సిలిండర్లు అందడం లేదని వచ్చిన వార్తలను జిల్లా పౌరసరఫరాల అధికారి మురళీనాధ్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. గజపతినగరంలో రోజుకు సుమారు 900 సిలిండర్లు సరఫరా అవుతున్నాయని, OTP వచ్చిన వెంటనే డోర్ డెలివరీ జరుగుతోందన్నారు.