విశాఖలో సందడిగా బోట్ రేస్‌

విశాఖలో సందడిగా బోట్ రేస్‌

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా మంగమారిపేట బీచ్ వద్ద గురువారం నిర్వహించిన మెక్నైజ్డ్ బోట్ రేస్‌ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఇటువంటి క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.