VIDEO: 'తూతూ మంత్రంగా గ్రామసభ'

VIDEO: తోట్లవల్లూరు(M) చాగంటిపాడులో శనివారం గ్రామసభ తూతూ మంత్రంగానే ముగిసిందని ప్రజలు తెలిపారు. మైక్ లేకపోవడంతో ముందువారికే వినిపించగా వెనుకవారికి ఏమి అర్థం కాలేదని పేర్కొన్నారు. ఆ గ్రామ పరిధిలోకి వచ్చే పంచాయతీకి కనీసం సమాచారం లేదని ఆరోపించారు. 2 నెలలుగా సెక్రటరీ లేని కారణంగా ఒక మరణ సర్టిఫికెట్ కోసం గ్రామస్తులు 15 రోజులు తిరగాల్సి వచ్చిందన్నారు.