నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని మండలాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్పంచులు, వార్డు స్థానాలలో పోటీ చేయాలనుకునేవారు ఎన్నికల నియమావళి అనుగుణంగా పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు స్పష్ట చేశారు.